ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో డేటా చోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో డేటా చోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి ఏపీ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని ఆయన మండిపడ్డారు.
ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.
డేటా చోరికి పాల్పడి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని పేర్నొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
