ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా లో ఆదివారం ఓ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విమాన ప్రమాదంలో.. గుంటూరుకి చెందిన యువతి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇథియోపియా గగనతలంలో ఆదివారం బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ విమానం కుప్పకూలింది. కాగా.. ఈ ఘటనలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. 

గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్‌బీబీఎస్‌ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.