Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు షాక్: వైసీపీకి గౌరు చరిత రాజీనామా

కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని గౌరు దంపతులు కలవనున్నారు.

gowru charitha reddy plans to  resign ysrcp today
Author
Kurnool, First Published Mar 1, 2019, 11:33 AM IST


కర్నూల్:కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని గౌరు దంపతులు కలవనున్నారు.. ఈ నెల 9వ తేదీన గౌరు దంపతులు టీడీపీలో చేరే చాన్స్ ఉంది.

రెండు రోజుల క్రితం గౌరు దంపతులు కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో పార్టీ మారే విషయమై చర్చించారు.  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవలనే  వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గౌరు చరిత చేతిలో ఓటమి పాలయ్యాడు. 

ఆ తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కాటసాని రాంభూపాల్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టును ఇవ్వనున్నట్టు సంకేతాలు రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు అసంతృప్తికి గురయ్యారు.

గౌరు దంపతులకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు.దీంతో  మనస్తాపానికి గురైన గౌరు దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు
శుక్రవారం నాడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడ గౌరు చరిత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గౌరు వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వీరిద్దరూ కూడ ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలవాలని నిర్ణయం తీసుకొన్నారు.

కర్నూల్ జిల్లా నుండి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీని వీడారు. గౌరు చరిత కూడ టీడీపీలో చేరితే వైసీపీని వీడి ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినట్టు అవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios