గుంటూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు.
గుంటూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

నెహ్రూనగర్ 9వ లైనులో ఏర్పాటు చేసిన రామారావు విగ్రహం తలను పగులగొట్టారు. ఇదే సమయంలో స్తంభాలగరువు, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో సైతం అన్నగారి విగ్రహాలను ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ చర్యకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.