డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదు.. ఉండవల్లి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 12, Mar 2019, 2:36 PM IST
ex mp undavalli arun kuamar comments on data theft issue
Highlights

డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 


డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డేటా దుర్వినియోగం చేయకపోతే... ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత కంగారు పడుతోందని ప్రశ్నించారు.

డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదని, ప్రభుత్వ పనితీరు చూసే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. టీడీపీ, వైసీపీ ఒకరిని ఒకరు దొంగలని తిట్టుకోవడం సరికాదన్నారు. జూన్‌లో పోలవరం నీళ్లు ఇవ్వడం అసాధ్యమని ఉండవల్లి అన్నారు. 

అలాగే ఏపీ ప్రభుత్వ డేటా చోరీపై వైసీపీ కేసు పెట్టడం తప్పుకాదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని బయటికి ఇవ్వడం నేరమన్నారు. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని ఆయన అన్నారు.

loader