టీడీపీలోకి మరో వారసుడు అడుగుపెట్టాడు. మాజీ మంత్రి జయరామ్ కుమారుడు రామ్మోహన్ టీడీపీలో చేరారు.
టీడీపీలోకి మరో వారసుడు అడుగుపెట్టాడు. మాజీ మంత్రి జయరామ్ కుమారుడు రామ్మోహన్ టీడీపీలో చేరారు. జయరామ్ గతంలో తెలుగు దేశం పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. సినీనటుడు చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి జంప్ చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రజా రాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి.. ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కుమారుడు రామ్మోహన్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం చిత్త శుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా రామ్మోహన్ కి చంద్రబాబు సూచించారు.
