ఏపీ ఎన్జీవోనేత అశోక్ బాబుపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

ఏపీ ఎన్జీవోనేత అశోక్ బాబుపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. అశోక్ బాబు ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా.. అతనికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాగా.. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అశోక్ బాబు ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఓ పార్టీ ముసుగులో ఉండి ఉద్యోగులకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టుపెట్టి.. ఎమ్మెల్సీ పదవి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని వారు ఆరోపించారు.