కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమె కుమారుడు దగ్గుబాటి హితేష్ ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమె కుమారుడు దగ్గుబాటి హితేష్ ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాగా.. హితేష్ కి జగన్.. టికెట్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

వచ్చే ఎన్నికల్లో హితేష్ వైసీపీ తరపున ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. దగ్గుబాటితోపాటు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీలో చేరారు. ఆమంచిని జగన్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
