కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై మండిపడ్డారు. రాజకీయాలు ఉంటే తెలంగాణలో చేసుకోవాలని హితవు పలికారు. అంతేకానీ ఏపీలో ఏదో చేస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాంటూ అంటూ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.
కర్నూలు: తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీలపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో రాజకీయాలు చేద్దామనుకుంటూ చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై మండిపడ్డారు. రాజకీయాలు ఉంటే తెలంగాణలో చేసుకోవాలని హితవు పలికారు. అంతేకానీ ఏపీలో ఏదో చేస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాంటూ అంటూ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీని నాశనం చేసేందుకు కుట్ర పన్నితే సహించేది లేదన్నారు. కేసీఆర్,ఓవైసీ, వైఎస్ జగన్ ముగ్గురూ కలిసి ఏపీని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి వచ్చి అనైతిక రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇప్పటికే ముగ్గురూ కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఇంకా చెయ్యాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపైనా నిప్పులు చెరిగారు. నరేంద్రమోదీ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే బెదిరిస్తారా అంటూ నిలదీశారు. మోడీపాలనలో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయ్యిందన్నారు.
మోదీ తప్పులను ఎత్తిచూపితే ఈడీ, ఐటీ దాడులతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మోదీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ కేటాయింపుపై కోడికత్తి పార్టీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు.
వాల్తేరు డివిజన్ ను రాయగఢకు తరలించి ఏపీకి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై వైసీపీ మాట్లాడకపోవడం వెనుక కుట్ర ఉందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
