త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో... తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో... తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 8లక్షల టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సోమవారం ఉదయం పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాంకేతికతను మనం ప్రోత్సహిస్తుంటే..సైబర్‌ క్రైమ్‌ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు.

వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని, వైసీపీ కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు.