ఏపీ సీఎం చంద్రబాబుకి సినీ నటుడు అలీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ రోజు ఉదయం 11గంటలకు చంద్రబాబుని కలవడానికి వస్తున్నానని.. పార్టీలో చేరతానని చెప్పిన ఆలీ.. వెంటనే ప్లేటు ఫిరాయించాడు. ఉదయాన్నే వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఈ విషయంపై బుద్ధా వెంకన్న  స్పందించారు. అలీ ఈ రోజు ఉదయం 11గంటలకు చంద్రబాబుని కలుస్తానని ఫోన్ చేసిమరీ చెప్పారని బుద్ధా వెంకన్న అన్నారు. కేసీఆర్ బెదిరించడంతో.. టీడీపీలో చేరాల్సిన ఆయన వైసీపీలో చేరారని చెప్పారు.

చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న వారిలో అలీ కూడా ఒకరని బుద్ధా తెలిపారు. జగన్.. వైసీపీని కేసీపీగా మార్చేశారని మండిపడ్డారు. దేవినేని ఉమా సోదరుడు ఎప్పుడో వైసీపీలో చారరని వివరణ ఇచ్చారు. ఎప్పుడో పార్టీలో చేరితో.. ఈ రోజు చేరినట్లు మీడియాలో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు..

పార్టీ మారినవాళ్లు సొంతవాళ్లు అయినా..తాను, దేవినేని పట్టించుకోవడం లేదన్నారు.