విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఇటీవల వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. తనను ఓడించేందుకు నారా లోకేష్ ను బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. 

ఓట్లను టీడీపియే తొలగించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మీదికి నెడుతున్నారని అవంతి సోమవారం మీడియాతో అన్నారు. అధికారంతో ప్రజలను భయపెడుతున్నారని ఆయన అన్నారు. లంచాలు లాగడంలో భిమిలీ నెంబర్ వన్ గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పని కావాలన్నా భిమిలీలో లంచాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. 

కేంద్రం మీద పోరాడుతున్నట్లు టీడీపి బిల్డప్ ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు తన కాలేజీలపై దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు అంగీకరించే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు.