ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు పార్టీ జంపింగ్ లు జరుగుతుంటే.. మరోవైపు పార్టీ టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ కోసం నాలుగు నుంచి ఐదు దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి.

ఈ క్రమంలో పార్టీ టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంలో అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అడిగితే టికెట్ ఇస్తారేమో అనే ఆశతో దరఖాస్తు చేస్తుండగా.. ఇంకొందరేమో ఏలాగైనా టికెట్ సాధించాలనే కసితో టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. మరో వారసురాలు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జరుగుతోంది. 

అశోక్‌ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతిరాజు 2019 ఎన్నికల నుంచి రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే మీసాల గీత ప్రజలకు అందుబాటులో ఉండరు అన్నవిమర్శ అంతటా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.