ఇన్నాళ్లూ చేసిన పని ఒక ఎత్తయితే ఇవాళ్టీ నుంచి చేసే పని మరో ఎత్తు అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన సోమవారం అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందన్నారు. మీ భవిష్యత్తుకు నా బాధ్యత అనేది టీడీపీ స్లోగన్ అని మీ జైలుకు నా భరోసా అనేది జగన్ స్లోగన్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పింఛన్లు, పసుపు-కుంకుమ ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ గెలిస్తే ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఒక్క రాత్రి కూడా ఉండని జగన్.. ఈ రాష్ట్రంలో ఎలా పోటీ చేస్తారని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని సామంతరాజుని పెట్టాలన్న కేసీఆర్ కుట్రలు సాగనివ్వమని చంద్రబాబు హెచ్చరించారు.