Asianet News TeluguAsianet News Telugu

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు: పోటీ చేసేవారి జాబితా ఇదే.....


ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ముహూర్తం చూసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆదేశాలు కూడా  జారీ చేశారు. శుక్రవారం రాత్రి రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు.
 

ap cm chandrababu naidu announced kakinada parliament tdp candidates
Author
Amaravathi, First Published Mar 2, 2019, 6:45 AM IST

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. 

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ముహూర్తం చూసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆదేశాలు కూడా  జారీ చేశారు. శుక్రవారం రాత్రి రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు.

కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ జాబితాపై గంటపాటు కసరత్తు చేశారు చంద్రబాబు. అందరితో చర్చించిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అభ్యర్థులలో అత్యధిక శాతం సిట్టింగ్ లే ఉండటం విశేషం. 

అయితే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎస్వీఎస్ ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. 

అయితే వర్మపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం సతీమణి తోట వాణిని బరిలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. 

మరోవైపు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరిన చలమలశెట్టి సునీల్ ను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. జగ్గంపేట నియోజకవర్గంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు చంద్రబాబు. జగ్గంపేట టికెట్ తనకు గానీ తన భార్యకు గానీ ఇవ్వాలని కాకినాడ ఎంపీ తోట నర్సింహం అల్టిమేటం జారీ చేశారు. 

అయితే చంద్రబాబు మాత్రం టికెట్ ను జ్యోతుల నెహ్రూకే కట్టబెట్టారు. పిఠాపురం అసెంబ్లీ టికెట్ తోట నర్సింహం సతీమణి తోట వాణికి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై తోట నర్సింహం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

అభ్యర్థుల జాబితా ఇదే.
కాకినాడ ఎంపీ 
టీడీపీ అభ్యర్థిగా: చలమలశెట్టి సునీల్

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
1. కాకినాడ అర్బన్: వనమాడి కొండబాబు
2. కాకినాడ రూరల్ : పిల్లి అనంతలక్ష్మీ
3. పెద్దాపురం: చినరాజప్ప
4. తుని : యనమల కృష్ణుడు
5. జగ్గంపేట: జ్యోతుల నెహ్రు
6. పత్తిపాడు : వరుపుల రాజా
7. పిఠాపురం :ఎస్వీఎస్ ఎన్ వర్మ లేక తోట వాణి

Follow Us:
Download App:
  • android
  • ios