ఏపీలో కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

ఏపీలో కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం చంద్రబాబు.. పార్టీ నేతలతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై.. ఏపీలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని.. వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.

ఈ ఎన్నికల్లో నేరగాళ్లతో మన పోరాటం చేస్తున్నామని, వైసీపీవి నేర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అని చంద్రబాబు అన్నారు. విశాఖకు మోదీ వస్తే నిలదీసే ధైర్యం వైసీపీకి లేదా.. అని చంద్రబాబు అన్నారు. అలాగే నిజాయతీపరులంతా టీడీపీలో చేరుతున్నారని, దశాబ్దాల వైరం వీడి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారని, కర్నూలులో కోట్ల, కేఈ కుటుంబాలే ఇందుకు రుజువు అన్నారు. 

అలాగే విజయనగరంలో బొబ్బిలి, గజపతిరాజులే సాక్ష్యం అని, కురుపాంలో వైరం వీడి టీడీపీతో ఏకమయ్యారని, కడపలో వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశారని, ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతా రావాలి.. వర్గాలకతీతంగా టీడీపీకి మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు