Asianet News TeluguAsianet News Telugu

సీఈసీని కలిసిన ఏపీ బీజేపీ నేతలు: డీజీపీని మార్చాలన్న కన్నా

రెవెన్యూ, పోలీస్ శాఖలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డేటా లీక్ వ్యవహారంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు

AP BJP Leaders meets central election commission
Author
New Delhi, First Published Mar 8, 2019, 12:53 PM IST

రెవెన్యూ, పోలీస్ శాఖలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డేటా లీక్ వ్యవహారంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మోసాలు ఒక్కసారిగా బయటపడేకొద్ది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వణికిపోతోందన్నారు. నేను కాదు వేరొకరు దొంగ అని చిత్రీంచడానికి తనకున్న బలమైన మీడియా సాయంతో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఈ విషయంలో వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా థర్డ్ పార్టీ దర్యాప్తు చేపట్టాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కన్నా వెల్లడించారు. డీజీపీని మార్చాలన్న విజ్ఞప్తిపై పరిశీలిన జరుపుతామని సీఈసీ తెలిపినట్లు కన్నా చెప్పారు.

ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ తప్పు ఉన్నా చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని చంద్రబాబుకు కన్నా సవాల్ విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios