ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాగా.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. వైసీపీలో చేరే సినీ నటుల సంఖ్య పెరిగిపోతోంది.

ఇప్పటికే అలీ, పృథ్వి, కృష్ణుడు, భానుచందర్, జయసుధ వంటి నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా మరో నటుడు వైసీపీలో చేరారు. నటుడు రాజారవీంద్ర వైసీపీలో చేరారు.

బుధవారం ఉదయం ముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణిలతో పాటు.. రాజా రవీంద్ర కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిని జగన్ పార్టీ కండువా కప్పి.. స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు.