అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం టీటీడీకు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ జీవోలో స్పష్టం చేసింది. 

త్వరలో పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పాతపాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన వారి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. 

ఇకపోతే శనివారం ఉదయం 11.30 గంటలకు టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ బోర్డు పాలకమండలి 50వ చైర్మన్ గా శనివారం వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.