అమరావతి:ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని  ఏపీ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ సీటు ఇవ్వలేదు. ఈ స్థానంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి జగన్ టిక్కెట్టు కేటాయించారు.

ఏపీలో వైసీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ విషయమై జగన్ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మెన్ పదవి దక్కుతోందని ప్రచారం సాగింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మెన్ కు బదులుగా రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు.