టీటీడీ ఛైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ
టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మూడు రోజుల క్రితం సుబ్బారెడ్డిని నూతన చైర్మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల: టీటీడీ ఛైర్మెన్‌గా వైవీసుబ్బారెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మూడు రోజుల క్రితం టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇవాళ తిరుమలలో టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
also read:టీటీడీకి కొత్త ఛైర్మెన్: మరోసారి వైవీ సుబ్బారెడ్డికే పదవి
వెంకటేశ్వరస్వామికి సేవ చేసే అవకాశం మరోసారి దక్కడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు. సామాన్య భక్తులకు వెంకటేశ్వరస్వామి దర్శనం కల్పించడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించినట్టుగా ఆయన గుర్తు చేశారు.తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకొన్నామన్నారు. తిరుమలలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను డీజీల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించుకొన్నామని ఆయన చెప్పారు.
వెయ్యేళ్ల క్రితం ప్రకృతి సిద్ద వ్యవసాయం ఆధారంగా పండించిన ధాన్యాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పించేవారన్నారు. గత 100 రోజులుగా సిద్ద వ్యవసాయం ద్వారా పండించిన పంటల ద్వారా నైవేద్యాన్ని పెడుతున్నామన్నారు.టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. త్వరలోనే పాలకమండలి సభ్యులను కూడ నియమించనుంది.