Asianet News TeluguAsianet News Telugu

తొలి విడత మంత్రులు రెండున్నరేళ్లే: వైఎస్‌ఆర్‌ఎల్పీ సమావేశంలో జగన్

ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. 25 మందితో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేయనున్నారు. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తానని.. వీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందినవారే ఉంటారని సీఎం స్పష్టం చేశారు.

ysrcplp meeting live updates
Author
Amaravathi, First Published Jun 7, 2019, 9:37 AM IST

ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. 25 మందితో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేయనున్నారు. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తానని.. వీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందినవారే ఉంటారని సీఎం స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన కేబినెట్‌కు తుది రూపును ఇవ్వనున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై ఒక స్పష్టతకు వచ్చారు జగన్. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్షం కానుంది.

ఈ భేటీలోనే ముఖ్యమంత్రి జగన్.. మంత్రుల పేర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముందు వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరెవరిని ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకున్నామన్న విషయంపై వారికి వివరించనున్నారు.

సామాజికవర్గాలు, ప్రాంతాలు, రాజకీయ పరిణామాల వంటి వాటి ఆధారంగానే మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు సీఎం ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని.. వెంటనే రావాల్సిందిగా వర్తమానం పంపారన్న ప్రచారం జరిగింది.

గురువారం సాయంత్రం మాత్రం కొందరు సీనియర్ నేతలను అందుబాటులో ఉండాలని జగన్ చెప్పినట్లుగా సమాచారం. గురువారం సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి లాంటి నేతలు హడావుడిగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే మంత్రివర్గం గురించి సంకేతాలు రాకపోవడంతో పాటు కాబోయే మంత్రుల పేర్లు బయటకు రాకపోవడంతో గురువారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయవాడకు చేరుకున్నారు. తమ పేరుందా లేదా అని జగన్‌కు సన్నిహితులనుకునే నేతను ఆరా తీస్తున్నారు. 

జగన్ తన కేబినెట్‌లో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, పర్యవేక్షణలో ఈ వర్గానిదే కీలకపాత్ర కావడంతో సహాజంగానే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కినట్లు సమాచారం. 

సామాజిక వర్గాల వారీగా:

రెడ్డి: 7
బీసీ: 6
కమ్మ: 2
కాపు: 2
ఎస్సీ: 2
ఎస్టీ: 1
క్షత్రియ: 1
ముస్లిం:1
మైనారిటీ: 1
బ్రాహ్మాణ: 1
వైశ్య: 1

మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ తనకు సన్నిహితులైన 25 మందికి తొలి విడతలో అవకాశం ఇవ్వనున్నారు. సీనియార్టీతో పాటు కనీసం రెండు సార్లు ఎన్నికైన వారు, పాదయాత్రలో హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు దక్కనున్నాయి. 

దాదాపుగా ఖరారైన పేర్లు

ధర్మాన ప్రసాదరావు
బొత్స సత్యనారాయణ
పిల్లి సుభాష్ చంద్రబోస్
బాలినేని శ్రీనివాసరెడ్డి
ఆనం రామనారాయణరెడ్డి
కొలుసు పార్ధసారథి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కొడాలి నాని
ఆదిమూలపు సురేష్
ప్రసాదరాజు
గ్రంధి శ్రీనివాస్
గుడివాడ అమర్నాథ్
కోలగట్ల వీరభద్రస్వామి
శ్రీనివాసులు
సుచరిత
 అనిల్ కుమార్ యాదవ్
మర్రి రాజశేఖర్
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
అనంత వెంకట్రామిరెడ్డి
బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి
కాపు రామచంద్రారెడ్డి
అంజాద్ బాషా
ఆర్కే రోజా
మేకపాటి గౌతం రెడ్డి
పినిపే విశ్వరూప్

పదవుల విషయంలో త్యాగాలకు సిద్ధం: శ్రీకాంత్ రెడ్డి 

పదవుల విషయంలో త్యాగాలకు సిద్ధం అన్నారు కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన పేరు మంత్రివర్గ జాబితాలో వినిపిస్తోంది.

గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు జగన్ సమానావకాశాలను కలిపించనున్నారని తెలిపారు. సీఎం ఆదేశాలను శిరసావహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ స్పీడుగా వెళ్లడం లేదని.. ఆలోచనగా వెళ్తున్నారని శ్రీకాంత్ తెలిపారు. 

మంత్రి పదవి ఇస్తే సంతోషం: రోజా

తనకు మంత్రి పదవి ఇస్తే సంతోషమేనన్నారు సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా. పార్టీ పెట్టినప్పటి నుంచి తాను జగన్ వెంట నడుస్తున్నానని... కష్టాల్లో తోడుగా నిలిచానని రోజా తెలిపారు.

తొలి మంత్రివర్గంలో కష్టపడిన వారికి, పార్టీ కోసం నిలబడిన వారికి న్యాయం చేస్తారని రోజా వెల్లడించారు. అసెంబ్లీలో మహిళల తరపున పోరాటం చేసి, ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యానని గుర్తు చేశారు. తనకు ఏ పదవి ఇచ్చినా శక్తిమేరకు పనిచేస్తానని రోజా వెల్లడించారు. 

జగన్ నివాసానికి పోటెత్తిన ఎమ్మెల్యేలు: ట్రాఫిక్ జాం

వైసీపీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ నేతలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో ఆ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ జాం అయ్యింది. కార్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు నడుచుకుంటూ సీఎం నివాసానికి వెళ్లారు. 

హోంమంత్రిగా సుచరిత

వైఎస్ జగన్ తన కేబినెట్‌లో మహిళలకు పెద్ద పీట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజాకు స్పీకర్ లేదా కీలక మంత్రిత్వ శాఖను అప్పగించనున్నారి టాక్. ఇక ముఖ్యమంత్రి తర్వాతి స్థానమైన హోంశాఖను గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. 2012 ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో ఓటమి పాలైనా... అందరిని కలుపుకునిపోయారు. కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. 

నా కేబినెట్‌లో బలహీనవర్గాలకు ప్రాధాన్యం: జగన్

రాష్ట్రం మొత్తం మనవైపే చూస్తొందన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. తాడేపల్లిలోని తన అధికారిక నివాసంలో జగన్ శుక్రవారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలని.. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని వైఎస్ జగన్ సూచించారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ముఖ్యమంత్రి తెలిపారు.

బాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారని.. అయితే తాను ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శకతకే ప్రాధాన్యమిస్తున్నామని జగన్ తెలిపారు. శనివారం 25 మంది మంత్రులతో పూర్తి స్థాయి కేబినెట్‌ ప్రమాణ స్వీకారం చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని వెల్లడించారు. 

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు ఉంటాయని.. అప్పుడు కొత్తవారికి అవకాశమిస్తామని సీఎం స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios