Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో వైసీపీదే హవా: విపక్షాలకు సింగిల్ డిజిట్లే

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. విపక్షాలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

ysrcp won all municipalities in tirupati mp segment lns
Author
Tirupati, First Published Mar 14, 2021, 3:57 PM IST


తిరుపతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. విపక్షాలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒక్క కార్పోరేషన్, మూడు మున్సిపాలిటీల్లో 125 వార్డులున్నాయి.తిరుపతి కార్పోరేషన్ సహా మూడు మున్సిపాలిటీలను కూడ  వైసీపీ దక్కించుకొంది. 

తిరుపతి కార్పోరేషన్ పరిధిలోని 50 వార్డుల్లో 49 వార్డులను వైసీపీ దక్కించుకొంది. ఒక్క స్థానంలో టీడీపీ మాత్రమే విజయం సాధించింది.చాలా ఏళ్ల తర్వాత ఎన్నికల్లో తిరుపతి కార్పోరేషన్ ను వైసీపీ దక్కించుకొంది.

ఇక నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. సుళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డుల్లో 24 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. ఒక్క స్థానంలో టీడీపీ గెలుపొందింది. ఇదే జిల్లాలోని నాయుడుపేట మున్సిపాలిటీలో 25 వార్డుల్లో 23 స్థానాల్లో వైసీపీ దక్కించుకొంది. ఒక్కొక్క స్థానంలో టీడీపీ, జనసేన అభ్యర్ధులు గెలుపొందారు.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.ఈ సమయంలో ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios