ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 వార్డులకు కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలవ్వగా, మరో ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.

ముందుజాగ్రత్తగా మరో ఆరు నామినేషన్లను వైసీపీ సానుభూతిపరులు వేశారు. రేపటితో విత్‌డ్రా గడువు ముగిసే సమయానికి మొత్తం 31 స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఇక్కడ 5 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 1983లో మాచర్ల మున్సిపాలిటీ ఏర్పడి తర్వాత ఇప్పటి వరకు 31 స్థానాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలవనుంది.