పశ్చిమగోదావరి  జిల్లా ఏలూరు కార్పోరేషన్ ను వైసీపీ కైవసం చేసుకొంది.ఇంకా మూడు డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మెజారిటీ డివిజన్లను వైసీపీ కైవసం చేసుకొంది. మూడు డివిజన్లకే టీడీపీ పరిమితమైంది.


ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ ను వైసీపీ కైవసం చేసుకొంది.47 డివిజన్లను వైసీపీ దక్కించుకొంది. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైందిహైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపును ఆదివారం నాడు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపును ఇవాళ నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గంటల నుండి సీఆర్ రెడ్డి కాలేజీలోని నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.

also read:చనిపోయినా విజయం సాధించారు: ఏలూరు కార్పోరేషన్‌లో ఇద్దరు వైసీపీ అభ్యర్ధులు

పోలింగ్ కు ముందే మూడు డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఆదివారం నాడు జరిగిన ఓట్ల లెక్కింపులో 42 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.2,4,5,10,11,17,18,21,22,23,24,25,26,31,33,36,38,39,40,41,42,43,45,46,48,49,50 సహా మరికొన్ని డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. 28,37,47 స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. ఇంకా మూడు డివిజన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.