Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఇలాకాలోనే ఇదీ పరిస్థితి.... టిడిపి అభ్యర్థిపై వైసిపి నాయకుల దాడి

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నికి లేఖ రాసారు.  

YSRCP supporters beating up TDP candidate at kuppam... chandrababu writes letters to SEC neelam sahni
Author
Kuppam, First Published Nov 5, 2021, 4:35 PM IST

చిత్తూరు: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ 14వ వార్డులో టిడిపి తరపున పోటీచేస్తున్న అభ్యర్థిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డాయి. దీంతో వైసిపి నాయకుల దౌర్జన్యకాండపై పిర్యాదుచేస్తూ టిడిపి చీఫ్ chandrababu రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నికి లేఖ రాసారు. తమ అభ్యర్థిపై దాడిచేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని... ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని neelam sahney ని కోరారు. 

kuppam మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అధికార అండతో టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 14వార్డు టిడిపి అభ్యర్థి వెంకటేశ్ నామినేషన్ వేయడానికి వెళ్ళగా వైసిపి నాయకులు దాడి చేసారని... అతడి చేతిలోని నామినేషన్ పత్రాలను కూడా లాక్కుని చించేసారనని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్దే ఈ దాడి జరిగిందంటూ ఎస్ఈసి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. 

ఒక్కసారిగా వెంకటేశ్ పైకి వచ్చిన దాదాపు 30మంది వైసిపి మద్దతుదారులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. తమ పార్టీ అభ్యర్థిపై దాడికి పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎస్ఈసిని కోరారు. 

read more  స్థానిక ఎన్నికలు.. కొందరు అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు: ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని... ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ కు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని... ప్రతి అభ్యర్థి స్వేచ్చగా నామినేషన్ వేసేలా చూడాలని లేఖద్వారా ఎస్ఈసి నీలం సాహ్నిని కోరారు చంద్రబాబు. 

టిడిపి అభ్యర్థిపై వైసిపి శ్రేణుల దాడివిషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుప్పం చేరుకున్నారు. బాధిత అభ్యర్థి వెంకటేశ్ ను పరామర్శించి దాడిని ఖండించారు. అండగా తామంతా వున్నామని...భయపడవద్దని అతడికి భరోసా ఇచ్చారు అమర్నాథ్ రెడ్డి. 

read more  స్థానిక ఎన్నికలు: నామినేషన్ వెనక్కి తీసుకో.. లేదంటే, గిరిజన మహిళకు వైసీపీ నేత బెదిరింపులు, ఆడియో వైరల్

ఇక ఇప్పటికే  స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. నిన్న విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబును టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, అశోక్‌బాబు కలిసి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరంలో వైకాపా నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని కన్నబాబు దృష్టికి తెచ్చారు. 

కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారిని కుప్పం మున్సిపాలిటీలో నియమించారని... ఆయన్ని విధుల నుంచి తప్పించాలని కోరినట్టు టీడీపీ నేతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో విపక్ష పార్టీలు నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.  

 
 

Follow Us:
Download App:
  • android
  • ios