Asianet News TeluguAsianet News Telugu

స్థానిక ఎన్నికలు.. కొందరు అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు: ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

స్థానిక సంస్థల (local body elections) ఎన్నికల నామినేషన్ల (nominations) సందర్భంగా వైసీపీ (ysrcp) దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ap election commission) టీడీపీ (tdp) కోరింది.  కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని మండిపడ్డారు

tdp leaders meets ap sec and complaint on ysrcp
Author
Amaravati, First Published Nov 4, 2021, 9:34 PM IST

స్థానిక సంస్థల (local body elections) ఎన్నికల నామినేషన్ల (nominations) సందర్భంగా వైసీపీ (ysrcp) దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ap election commission) టీడీపీ (tdp) కోరింది. గురువారం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబును టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, అశోక్‌బాబు (ashok babu) కలిసి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరంలో వైకాపా నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని కన్నబాబు దృష్టికి తెచ్చారు. 

అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారిని కుప్పం మున్సిపాలిటీలో (kuppam municipality) నియమించారని ఆయన్ను విధుల నుంచి తప్పించాలని కోరినట్టు టీడీపీ నేతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో విపక్ష పార్టీలు నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.  

ALso Read:ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ  స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది.

అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.  పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios