విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మారుస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దివంగత సీఎం ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి. 

రాజధానిపై కొందరు బీజేపీ, టీడీపీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తన బినామీలు, బంధువులకు తక్కువరేట్లకే ముట్టజెప్పిన చంద్రబాబు కావాలనే రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. 

రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది వాస్తవమేనన్నారు. వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారని దాంట్లో ఏమాత్రం తప్పలేదన్నారు. చంద్రబాబు బినామీలైన కొందరు బీజేపీలో చేరి రాజధాని మారుస్తున్నారనే దుష్ప్రచారాలు పుట్టిస్తున్నారంటూ ఎంపీ సుజనాచౌదరిపై సెటైర్లు వేశారు. చంద్రబాబు బినామీలు అయిన సుజనాచౌదరి, మురళీమోహన్‌లతో పాటు వారి బంధువులు, అయినవారికి వేల ఎకరాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా  అని చంద్రబాబును ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.  

ఈ వార్తలు కూడా చదవండి

రాజధానిని దొనకొండకు మారుస్తానని జగన్ చెప్పలేదన్న లక్ష్మీపార్వతి