Asianet News TeluguAsianet News Telugu

ఏపీ శాసనమండలిలో టీడీపీకి చెక్: బలం పెంచుకోనున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ బలం పెరగనుంది. 14 మంది ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైతే వైసీపీ బలం 32కి చేరుకోనుంది. టీడీపీ బలం  మాత్రం పడిపోనుంది. శాసనమండలిలో  బలం పెంచుకొనేందుకు కొంతకాలంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వచ్చే నెలతో తీరిపోనున్నాయి.

YSRCP set to get majority in Andhra Pradesh Legislative Council after MLC election
Author
Guntur, First Published Nov 10, 2021, 4:03 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ బలం పెరగనుంది. ఎమ్మెల్సీ కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైతే శాసమనండలిలో వైసీపీ టీడీపీపై పైచేయి సాధించనుంది. ఏపీ అసెంబ్లీలో బిల్లులను మండలిలో ఉన్న బలంతో టీడీపీ  అడ్డుకొంటుంది. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులే మండలిలో అడుగు పెట్టనున్నారు. 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. ఈ మూడు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి.ఏపీలోని 11 స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహిస్తారు.14 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకొని టీడీపీపై ఏపీ శాసమండలిలో వైసీపీ పై చేయి సాధించనుంది.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  Ycpఅభ్యర్ధులు 80 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించారు. దీంతో 14 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఏపీ శాసనమండలిలో 58 మంది స్థానాలున్నాయి. ప్రస్తుతం వైసీపీకి 12 మంది, Tdpకి 15 మంది, పీడీఎప్ కు నలుగురు, నలుగురు ఇండిపెండెంట్లు, Bjpకి ఒక్క సభ్యుడున్నారు. ఆరుగురిని గవర్నర్ నామినేట్ చేశారు.

also read:‘‘ ఎమ్మెల్సీ ’’ అభ్యర్ధులపై జగన్ ఫోకస్.. 14 మంది ఖరారు, అవకాశం దక్కేది వీరికే..!!

MLA Quota  కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలున్నారు.గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి ఒకరు విజయం సాధించారు. ఆరుగురిని గవర్నర్ నామినేట్ చేశారు.ఈ ఆరుగురు కూడా వైసీపీ మద్దతుదారులే. టీడీపీకి చెందిన కౌన్సిల్ ఛైర్మెన్ ఎంఏ షరీఫ్, బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి ఈ ఏడాది మే లో రిటైరయ్యారు. దీంతో మూడు స్థానాలకు ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించనున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే నెల 10న నిర్వహించనున్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు పైగా కౌన్సిల్ లో మెజారిటీ ఉన్న టీడీపీ మూడు రాజధానుల బిల్లు సహా మరికొన్ని బిల్లులను వెనక్కు పంపింది. ఈ నెల, వచ్చే నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు  శాసనమండలిలో అడుగు పెట్టనున్నారు.  దీంతో ఏపీ శాసనమండలిలో వైసీపీ బలం 32 మందికి చేరుకోనుంది.అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం తగ్గిపోవడం, స్థానిక సంస్థల్లో కూడా టీడీపీ బలం పడిపోయింది.

శాసనమండలిలో రిటైరౌతున్న టీడీపీ సభ్యుల సంఖ్య పడిపోతోంది.  ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఏపీ శాసనమండలిలో టీడీపీ బలమే ఎక్కువగా ఉంది. వచ్చే నెలతో వైసీపీ ఎమ్మెల్సీల బలం పెరగనుంది. దీంతో టీడీపీ బలం తగ్గనుంది. దీంతో చట్టసభల్లో బిల్లులను పాస్ చేసుకొనేందుకు అధికార వైసీపీ ఇబ్బందులు తొలగనున్నాయి.అసెంబ్లీలో, శాసనమండలిలో టీడీపీ బలం నామమాత్రంగానే ఉండనుంది. దీంతో వైసీపీ తీసుకొచ్చే బిల్లులను అడ్డుకోవడం ఆ పార్టీకి గతంలో మాదిరిగా సులువైన పనికాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios