Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ యాప్‌నకు వైసీపీ కౌంటర్: ఈ- నేత్రం యాప్ విడుదల

రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్ కు పోటీగా వైఎస్ఆర్‌సీపీ  ఈ-నేత్రం పేరుతో యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించింది.
 

Ysrcp realeses E-netram app for ap local body elections lns
Author
Guntur, First Published Feb 3, 2021, 5:14 PM IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్ కు పోటీగా వైఎస్ఆర్‌సీపీ  ఈ-నేత్రం పేరుతో యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించింది.

పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ యాప్ పై వైఎస్ఆర్‌సీపీ అనేక అనుమానాలను వ్యక్తం చేసింది.

ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని వైసీపీ ఆరోపణలు చేసింది.ఈ ఆరోపణలను  ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఎన్నికల సంఘం ప్రారంభించిన యాప్ కు కౌంటర్ గా ఈ-నేత్రం పేరుతో యాప్ ను వైసీపీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

క్షేత్రస్థాయిలో చోటు చేసుకొన్న ఘటనలకు సంబంధించి నేరుగా ఎక్కడినుండైనా పిర్యాదు చేసుకొనేందుకు ఈ యాప్ ద్వారా అవకాశం ఉంది.  అంతేకాదు ఫోటోలు, వీడియోలు కూడ ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఫిర్యాదులను ఎస్ఈసీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ యాప్ లో అప్ లోడైన ఫిర్యాదులను  ఎన్నికల సంఘానికి వైసీపీ అందించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios