Asianet News TeluguAsianet News Telugu

స్విచ్ వేయ‌కుండా ఫ్యాన్ తిర‌గ‌డంలేదంటే ఎలా..? : జైల్లో చంద్ర‌బాబు పై విజ‌య‌సాయి రెడ్డి సెటైర్లు

Amaravati: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు (గురువారం) విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో ఉన్న చంద్ర‌బాబుపై వైఎస్సార్సీపీ ఎంసీ విజ‌య‌సాయి రెడ్డి స్పందిస్తూ.. స్విచ్ వేయ‌కుండా ఫ్యాన్ తిర‌గ‌డంలేదంటే ఎలా.. అంటూ సెటైర్లు వేశారు. 

YSRCP  Rajya Sabha member Vijaya Sai Reddy slams Chandrababu Naidu  RMA
Author
First Published Sep 21, 2023, 10:23 AM IST

Chandrababu Naidu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో ఉన్న చంద్ర‌బాబుపై వైఎస్సార్సీపీ ఎంసీ విజ‌య‌సాయి రెడ్డి స్పందిస్తూ.. వేయ‌కుండా ఫ్యాన్ తిర‌గ‌డంలేదంటే ఎలా.. అంటూ సెటైర్లు వేశారు. ఎక్స్ వేదిక‌గా స్పందించిన విజయ‌సాయి రెడ్డి.. ''వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?'' అంటూ పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును ఎదుర్కొంటున్న చంద్ర‌బాబును మ‌రో కేసు చుట్టుముట్టింది. చంద్రబాబు నాయుడిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ-సీఐడీ ఏసీబీ కోర్టులో ఖైదీ ట్రాన్సిట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త దుమారం రేగింది. ఏపీ ఫైబర్నెట్ ఫేజ్-114 ప్రాజెక్టు కుంభకోణంలో రాష్ట్ర ఖజానాకు రూ.114 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు, ఇతరులు నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి తమ సహచరులకు చెందిన కంపెనీల వెబ్ ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏపీ-సీఐడీ ఆరోపించింది. పీటీ వారెంట్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసులో చంద్రబాబును 25వ నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ మంగళవారం కోర్టులో మెమో దాఖలు చేసింది. రూ.371 కోట్ల విలువైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.

కుంభకోణం జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉన్నందున ఆయనను ప్రధాన నిందితుడిగా చూడాలని సీఐడీ మెమోలో పేర్కొంది. 'ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ చేపట్టాలని చంద్రబాబు స్వయంగా సిఫార్సు చేశారు. హరికృష్ణకు క్రిమినల్ నేపథ్యం ఉన్నప్పటికీ వేమూరి హరికృష్ణను గవర్నింగ్ కౌన్సిల్-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా నియమించారు' అని ఏపీ-సీఐడీ పేర్కొంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాల ప్రక్రియకు సంబంధించి మార్కెట్ సర్వే నిర్వహించలేదనీ, పాటించాల్సిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని పేర్కొంది. అంతేకాకుండా వేమూరి హరికృష్ణప్రసాద్ ను వివిధ టెండర్ మదింపు కమిటీల్లో చేర్చాలని చంద్రబాబు ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారుని ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios