హిందూపురం: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణను గురువారం నాడు అడ్డుకొనేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. రాయలసీమ ద్రోహీ అంటూ  బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడ బాలకృష్ణ కాన్వాయ్‌కు రక్షణగా నిలబడ్డారు.  పోలీసులు జోక్యం చేసి బాలకృష్ణను అక్కడి నుండి పంపారు.

Also read:విశాఖలో వైసీపీ నేతలు భూదందా... కేవలం 9నెలల్లో 30వేల ఎకరాలు: బోండా ఉమ

మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకిస్తోంది. బాలకృష్ణ తన స్వంత నియోజకవర్గం హిందూపురానికి గురువారం నాడు వచ్చారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తున్న విషయాన్ని ముందే తెలుసుకొన్న వైసీపీ కార్యకర్తలు  బాలకృష్ణను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేశారు.

బాలకృష్ణ కాన్వాయ్ హిందూపురం వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు రాయలసీమ ద్రోహీ అంటూ ప్ల కార్డులు చేతబూని బాలకృష్ణ కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. 

.  ఈ విషయం తెలుసుకొన్న టీడీపీ కార్యకర్తలు  కూడ వెంటనే బాలకృష్ణ  కాన్వాయ్ వద్దకు చేరుకొన్నారు. బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుగా నిలిచారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అతి కష్టం మీద   బాలకృష్ణ కాన్వాయ్‌ను  పంపించారు.  నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.