Asianet News TeluguAsianet News Telugu

రాజీనామాలకైనా సిద్దంగా వుండాలి: వైసిపి ఎంపీలతో జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ స్ధానాల్లోనూ వైఎస్సార్‌సిపి భారీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. ఏపిలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా వైసిపి 23 స్థానాలను గెలుచుకుంది. ఇలా గెలిచిన ఎంపీలంతా శనివారం తాడేపల్లిలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు.  

YSRCP President YS Jagan in Parliamentary party meeting with MP's at Tadepalli party office
Author
Tadepalli, First Published May 25, 2019, 1:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ స్ధానాల్లోనూ వైఎస్సార్‌సిపి భారీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. ఏపిలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా వైసిపి 23 స్థానాలను గెలుచుకుంది. ఇలా గెలిచిన ఎంపీలంతా శనివారం తాడేపల్లిలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు.  

ఈ సమావేశం అనంతరం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి  ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపికి ప్రత్యేక హోదా సాధించే ఎజెండాతోనే ప్రతి ఒక్కరు పనిచేయాలని జగన్ ఎంపీలకు సూచించారు. కేంద్రాన్ని ఒప్పించి స్వరాష్ట్రానికి హోదా సాధించిపెట్టాలని... అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్దంగా వుండాలని వారికి జగన్ సూచించారు. 

'' మనమంతా ఏపికి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచాం. ఆ  హామీని నమ్మే ప్రజలు మనకు ఇలా భారీ మెజారిటీతో గెలిపించారు. కాబట్టి  పార్లమెంట్ సమావేశాల్లో స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్‌కు సిద్దంగా వుండాలని సూచించారు. సందర్భాన్ని బట్టి పార్టీ ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకోవాల్సి వుంటుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.'' అని జగన్ తెలిపారు. 

అయితే ఈ సమావేశం పార్లమెంటరీ నేతను ఎన్నకోకుండానే వాయిదా పడింది. రేపు ఉదయం ఎంపీలంతా జగన్ కలిసి డిల్లీకి వెళ్లనున్నారు. వీరంతా ప్రధాని మోదీతో స్పెషల్ స్టేటస్ గురించి  మాట్లాడనున్నారు. కాబట్టి ముఖ్యంగా డిల్లీలో టూర్ గురించే తమ మధ్య చర్చ జరిగినట్లు...కొద్ది రోజుల్లోనే మరోసారి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటరీ నేతను ఎన్నుకుంటామని వైసిపి ఎంపీ ఒకరు వెల్లడించారు.     
 
Follow Us:
Download App:
  • android
  • ios