కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో బిజీబిజీగా గడుపుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో బుధవారం ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజాదర్బార్ అనంతరం స్థానికి వీజే ఫంక్షన్ హాలులో రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు. 

ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులు వైఎస్ జగన్ కు ఖర్జూరాలు తినిపించారు. ఇకపోతే గురువారం కూడా కడప జిల్లాలోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. 17న తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు వైఎస్ జగన్.