ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మెయిద జంక్షన్ లోని బహిరంగ సభలో అనుకోని సంఘటన ఆవిష్కృతమైంది. జగన్ ప్రసంగిస్తుండగా ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళుతున్న ఆటో అటువైపు వచ్చింది. ఈ సభ వద్ద భారీగా జనం అడ్డుగా ఉండటంతో ఎటూ వెళ్లలేక అక్కడే  ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆ ఆటోకు దారి ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. దీంతో అందరు ఆ ఆటోకు దారి ఇచ్చారు.

ఈ ఘటనను ఉదాహరణగా తీసుకుని జగన్ సీఎం చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 108 పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 27 అంబులెన్స్ లు ఉంటే అందులో 10 అంబులెన్స్ లు షెడ్ కు పరిమితమయ్యాని జగన్ అన్నారు. గతంలో 108 కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ మంటూ వచ్చే అంబులెన్స్ నేడు మూగబోయిందన్నారు. 

ఇలా పురిటినొప్పులతో నిండు గర్భిణి బాధపడటం చూసి చలించిపోతున్నట్లు జగన్ తెలిపారు. అంబులెన్స్ లు లేక గర్భిణీ స్త్రీలను ఆటోలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 108 సిబ్బందికి జీతాలు చెల్లించి వాళ్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 108 సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి చోద్యం చూస్తుందని మండిపడ్డారు. 

వీడియో

"