వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ: కీలకమైన ఐదు తీర్మానాలను ఆమోదించనున్న ప్లీనరీ

రెండు రోజుల పాటు జరగనున్న వైసీపీ ప్లీనరీలో  ఐదు తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ కీలకమైన ఐదు తీర్మానాలపై ప్రతినిధులు చర్చించి ఆమోదించనున్నారు. మరో వైపు వైసీపీ పార్టీ నియావళిలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ ప్లీనరీకి ఇవాళ లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం ఉంది.

YSRCP Plenary to pass five resolutions

అమరావతి: YSRCP Plenary లో ఐదు తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీని నిర్వహించనున్నారు. Guntur  జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి సమీపంలో ఈ ప్లీనరీని నిర్వహిస్తారు. వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్లీనరీలో తీర్మానాల ముసాయిదాలను తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

బలహీన వర్గాలకు సాధికారిత, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలపై తీర్మానాలను ఆమోదించనున్నారు. మరో వైపు ఈ ప్లీనరీలోనే వైఎస్ జగన్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకొంటారు.  అయితే పార్టీ నియమావళిలో మార్పులు చేర్పులపై కూడా ఈ ప్లీనరీలో చర్చించే అవకాశం లేకపోలేదు. వైసీపీ ప్లీనరీలో YS Jagan ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించేలా మార్పులు చేస్తారని ప్రచారం సాగుతుంది. 

రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాము ఏనాడూ కూడా వెనుకాడలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కరోనా సమయంలో కూడా పేదలను ఆదుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్న విషయాన్ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గుర్తు చేశారు.

రెండు రోజుల పాటు జరిగే వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీని విజయవంతం చేసేందుకు గాను 20 రకాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి  సహా పలువురు కీలక నేతలకు చోటు కల్పించారు. ఈ కమిటీల్లో వైవీ సుబ్బారెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఈ కమిటీల్లో ఉన్నారు. ప్లీనరీ ఏర్పాట్లను ఈ కమిటీలు చేశాయి.  ఈ ప్లీనరీకి ఏర్పాట్లు చేసేందుకు గాను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నేతలు తమకు కేటాయించిన బాధ్యతలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. అన్ని కమిటీలకు కన్వీనర్ గా మంత్రి బొత్స నారాయణ వ్యవహరించనున్నారు. టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డిని ఇన్విటేషన్ కమిటీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రజా ప్రతినిధులను సమన్వయం చేయనున్నారు.ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించింది. 

also read:వైసీపీ ప్లీనరీలో నోరూరించే వంటకాలు: 25 రకాల వెరైటీలు, మెనూ ఇదే...

ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నారు.ఈ ప్లీనరీలో  వచ్చే రోజుల్లో పార్టీ ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించనుందో కూడా ప్రకటించనుంది. పార్టీ నియమావళిలో కూడా మార్పులు చేర్పులు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ ఏ రకమైన కార్యక్రమాలను తీసుకోనుందో కూడా ప్లీనరీ వేదికగా వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉంది.వైసీపీ ప్లీనరీలో ప్రతిపాదించనున్న తీర్మానాలపై పలువురు మంత్రులు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రసంగించనన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios