అమరావతి: మూడు రాజధానులపై మళ్లీ ప్రజాభిప్రాయానికి వెళ్లాలని టీడీపీ చేస్తున్న డిమాండ్ పై వైసీపీ కూడ సై అంటోంది. ఉప ఎన్నికకు తాను సిద్దమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది.

ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు జూలై 31వ తేదీన  గవర్నర్ ఆమోదం తెలిపారు.

మూడు రాజధానుల ఏర్పాటు ఇక లాంఛనమే. అయితే మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పును కోరాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.  అసెంబ్లీలో కూడ అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వైసీపీ మద్దతు పలికిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పును కోరాలని టీడీపీ డిమాండ్ కు వైసీపీ కౌంటర్ ఇస్తోంది.  టీడీపీ నుండి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది.

ఉప ఎన్నికల ఫలితాన్నిరాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసినా కూడ తనకు సమ్మతమేనని ఆయన తేల్చి చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో సీఆర్ డీఏ లో గ్రామాలు ఉంటాయి. అయితే రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన  రైతులు 240  రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ సాంకేతికంగా వైసీపీలో చేరలేదు. కానీ జగన్ కు మాత్రం ఆయన మద్దతు ప్రకటించారు. . ఇతర పార్టీల నుండి తమ పార్టీలో చేరే వారు ఇతర పార్టీల ద్వారా లభించిన పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకొంటామని జగన్ ప్రకటించారు. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా టీడీపీ డిమాండ్ కు చెక్ పెట్టవచ్చనే వైసీపీ భావనగా కన్పిస్తోంది.

గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనంలో కూడ గన్నవరం నుండి టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ విజయం సాధించారు. అయితే వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుపై 800 ఓట్లతో ఆయన విజయం సాధించారు.ఎన్నికలు ఇప్పుడు వస్తాయనే పరిస్థితి ఉంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని వంశీ ప్రకటించారు. 

also read:ఉప ఎన్నికకు నేను రెడీ: వల్లభనేని వంశీ

కరోనా కారణంగా రాజీనామా చేసినా కూడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వంశీ భావిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గన్నవరం నుండి ఉప ఎన్నికలు వస్తే వల్లభనేని వంశీ పోటీ చేయించడం ద్వారా  గెలిస్తే రాజకీయంగా టీడీపీపై పైచేయి సాధించే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి.