Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. వీటిపై లేవనెత్తాలని జగన్ చెప్పారు: విజయసాయిరెడ్డి

శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో (parliament winter session) అనుసరించాల్సిన వ్యూహాంపై జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం (polavaram) అంచనాలను రూ. 55 వేల కోట్ల ఆమోదానికి కృషి చెయ్యాలని సీఎం ఆదేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 

ysrcp parliamentary meeting completed
Author
Amaravati, First Published Nov 26, 2021, 7:07 PM IST

తమకు ఏ కూటములు లేవని..  ప్రజల ప్రయోజనాలకోసం ఎవరితో రాజీ పడే పని లేదన్నారు వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy). శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో (parliament winter session) అనుసరించాల్సిన వ్యూహాంపై జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఎంపీలంతా పార్లమెంట్‌లో లెవనెత్తుతామన్నారు. పోలవరం (polavaram) అంచనాలను రూ. 55 వేల కోట్ల ఆమోదానికి కృషి చెయ్యాలని సీఎం ఆదేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 

రూ. 2,140 కోట్ల పెండింగ్ బకాయిలు తీసుకురావాలని సూచన చేశారని ఆయన చెప్పారు. జాతీయ ఆహార భద్రత పథకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని.. దీనిపై ఉభయసభల్లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన (ap bifurcation) తరువాత కేంద్రం సూచన మేరకు తెలంగాణకి (telangana) 6112 కోట్ల విద్యుత్‌ని సరఫరా (power supply) చేశామని ఆయన గుర్తుచేశారు. వాటిని వసూలు చేసి ఇప్పించే బాధ్యత కేంద్రానిదేనన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాల్లో దాని గురించి ఒత్తిడి తెస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని.. మిగతా రాష్ట్రాలతో సమానంగా కేంద్రం ఎందుకు చూడటం లేదని ఆయన ప్రశ్నించారు. 

Also Read:విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

అంతకుముందు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు‌పై (chandrababu naidu) వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. ‘‘ తుఫాన్లను కంట్రోల్ చేశానంటాడు. సీమ వరదలు మానవ తప్పిదం అంటాడు. తాను ఏడిస్తే ఎవరూ పట్టించుకోవట్లేదంటాడు. తన బాధ ప్రపంచ బాధ అంటాడు. కుప్పం దెబ్బకు కకావికలమయ్యాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తాడట! మరి14 ఏళ్లు ఏం పీకాడని జనం చెవులు కొరుక్కుంటున్నారు ’’ అంటూ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడా? ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాడో అర్ధం కావడం లేదు. కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల అన్నింటినీ తన రాజకీయాలకు వాడేస్తున్నాడు. వరద సమయంలో ఈ బురద రాజకీయాలు ఏంటో. వరద వచ్చి పోయినా మాకు ఈ బురద  ఏంటంటున్నారు ప్రజలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios