విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో చోటు చేసుకొన్న వరదలను కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

AP CM YS Jagan Serious Comments on TDP in AP Assembly

అమరావతి:గడచిన వంద ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. భారీ వర్షాలతో మూడు జిల్లాల్లో తీవ్రమైన నష్టం చోటు చేసుకొందన్నారు.AP Assemblyలో  ఇటీవల కురిసిన భారీ వర్షాలపై Ys Jagan శుక్రవారం నాడు ప్రకటన  చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు.  ప్రకృతి విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. రాజకీయాల కోసం బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. 

అనూహ్యమైన వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్న దాచి పెట్టలేమని సీఎం జగన్ తెలిపారు.  ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.పింఛ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇన్‌ఫ్లో వచ్చిందని సీఎం జగన్ చెప్పారు.చెయ్యేరు నది పరివాహక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.tirupati, శేషాచలం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం మొత్తం చెయ్యేరులోకి చేరిందని సీఎం తెలిపారు.చెయ్యేరు. వరద ఉధృతిలో ఓ బస్సు కూడా చిక్కుకుపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. వరద ఉధృతికి ప్రాజెక్టుల కట్టలు కూడా తెగిపోయాయన్నారు. ఏడాదిలో ఒక్క సారి కూడా నిండని జలాశయాలు ఒకటి రెండు రోజుల్లోనే నిండిపోయాయని చెప్పారు. 

చంద్రబాబుపై జగన్ సెటైర్లు

గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక్క చోటు శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనపై చంద్రబాబు చేసిన విమర్శలపై కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాల గర్భంలో కలిసిపోయాడని చంద్రబాబు విమర్శలు చేసిన కామెంట్స్ ను జగన్ అసెంబ్లీలో చదివి విన్పించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడు, ఏం మాట్లాడో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు అంటూ జగన్ సెటైర్లు వేశారు.   కడప జిల్లాపై తనకు ఉన్న ప్రేమేను ఏనాడూ కూడా దాచుకోలేదన్నారు. అయితే బాహటంగానే చూపిస్తానని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. ఈ విషయమై తాను సీనియర్ అధికారులతో చర్చించిన విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మానవత్వాన్ని చూపారా అని ఆయన అడిగారు. వరద నష్టం  అంచనాలు పూర్తి చేసి వెంటనే బాధితులకు పరిహారం అందించినట్టుగా సీఎం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం మూడు నాలుగు నెలలు పట్టేదన్నారు. రోడ్లకు సంబంధించి  నివేదికలు తెప్పించుకొని యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా జగన్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios