Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై జగన్ పనితీరు, వైసీపీ ఎంపీల వ్యాఖ్యలు ఇవి.. లోకేశ్ ట్వీట్ వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వైసీపీ నేతలు మాట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ysrcp mps afraid to tell their opinions to cm jagan says nara lokesh ksp
Author
Amaravathi, First Published May 6, 2021, 7:15 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వైసీపీ నేతలు మాట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోందని, ఏం చేయలేని పరిస్థితి నెలకొందని సీఎం జగన్ చేతులెత్తేశారని స్వయంగా వైసీపీ నేతలే చెబుతున్నారని లోకేశ్ ఆరోపించారు.

ఈనెల 3వ తేదీన రాజమండ్రి వైసిపి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ తదితరులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కరోనా పరిస్ధితులపై మాట్లాడుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు తరలించడానికి 30,000 రూపాయలు ,దహన సంస్కారాలకు 12000 రూపాయలు తీసుకుంటున్నారని వారు అన్నట్లుగా వీడియోలో వుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు స్పందించాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios