కళింగిరి శాంతితో తన సంబంధం బయటపెట్టిన విజయసాయి రెడ్డి

‘‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.’’

YSRCP MP Vijaysai Reddy Reveals His Connection with Kalingiri Shanti GVR

తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు.

‘‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

 

ఈ వ్యవహారంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని శపథం చేశారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని.. ఆమెతో తనకు సంబంధం అంటగట్టారని ఆక్షేపించారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి... అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తానని.. వారి అంతు చూస్తానని హెచ్చరించారు. 

‘నేను చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్‌​ మెయిల్‌ చేసి డబ్బు వసూల్‌ చేసే వ్యక్తిని కాదు. నాపై అసత్యం ప్రచారం చేసిన మీడియా సంస్థలపై అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తా. పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌  చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios