Asianet News TeluguAsianet News Telugu

బాబుపై డౌట్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆంధ్రా పోలీసులు వద్దు: సిఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు. 

ysrcp mp vijayasaireddy writes a letter to cec
Author
Delhi, First Published Apr 13, 2019, 2:51 PM IST

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని లేఖలో కోరారు. 
 స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని సూచించారు. 

అన్ని స్ట్రాంగ్ రూమ్ లో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు. 

రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రజల తీర్పును పటిష్టంగా భద్రపరచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

ysrcp mp vijayasaireddy writes a letter to cec

Follow Us:
Download App:
  • android
  • ios