అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్ దూసుకుపోతుంటే చంద్రబాబు మాత్రం ఏడుగొండి చర్యలతో మరింత పతనమవుతున్నారంటూ మండిపడ్డారు. 

వరదలొచ్చిన ప్రతీసారి వేలమంది నిరాశ్రయులవుతారు. ఇల్లు, పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే దృశ్యం. కానీ చంద్రబాబుకు వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తోందని అని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు ఇచ్చి ఆదుకోవాలని సలహా ఇచ్చారు. లేకపోతే లావైపోతారు అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిన తర్వాత ఇప్పుడు చలో ఆత్మకూర్ అనే చెత్త సినిమా వదిలారంటూ విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.