హైదరాబాద్: ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై విరుచుకుపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. దమ్ముంటే తనతో చర్చకు రావాలని కుటుంబరావు విసిరిన సవాల్ పై విజయసాయిరెడ్డి స్పందించారు. 

కుటుంబరావు గారూ, స్వైన్ ఫ్లూ మాదిరిగా చంద్రబాబు వైరస్‌ను వ్యాప్తిచేసే గుంపులో మీరొకరు అంటూ ట్వీట్ చేశారు. అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్‌గా బతికే సమూహాలు మీరంతా అంటూ మండిపడ్డారు. 

అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలక నీతులు వల్లిస్తారా అంటూ ప్రశ్నించారు. మే 23 తర్వాత మీ బతుకులు రోడ్డున పడతాయి. మేసిందంతా వడ్డీతో సహా కక్కాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.