ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక దొంగ అని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ పై విమర్శల దాడి చేశారు.  

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక దొంగ అని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ పై విమర్శల దాడి చేశారు. 

నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతీ పనిలో, ప్రతీ పథకంలో అవినీతి జరిగిందన్నారు. కమీషన్లు లేకుండా చంద్రబాబు, లోకేష్ ఏ పనికి ఆదేశాలు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు దేశం విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ దేశం విడిచి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్రం వారి పాస్‌పోర్టు రద్దు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.