Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ కోసం డజన్ల మంది లాయర్లు.. ఎందుకంత హైరానా: బాబుపై విజయసాయి వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉంటే, ఈసీ స్వతంత్రంగా పనిచేయదని విజయసాయి ఆరోపించారు.

ysrcp mp vijayasai reddy slams tdp chief chandrababu naidu over nimmagadda ramesh kumar issue
Author
Amaravathi, First Published Jun 2, 2020, 5:48 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉంటే, ఈసీ స్వతంత్రంగా పనిచేయదని విజయసాయి ఆరోపించారు.

దీనిలో భాగంగా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయారని, చంద్రబాబు రెండు డజన్ల అడ్వొకేట్లను రంగంలోకి దింపారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డ కోసం టీడీపీ అధినేత ఎందుకు అంత హైరానా పడుతున్నారోనని విజయసాయి సెటైర్లు వేశారు. 

Also Read:నేను చచ్చేంత వరకు వైసిపిలోనే... జగన్ వెంటే: విజయసాయి రెడ్డి

కాగా మొదటి నుండి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాము భరోసా ఇస్తున్నామని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ఎం జరిగిన అండగా ఉంటామని...టీడీపీ కవ్వింపు చర్యల వల్లే తమ వాళ్లు పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి తమ పార్టీ నాయకురాలి పైనే తప్పుడు పోస్టులు పెట్టారని విజయసాయి రెడ్డి  ఆరోపించారు. 

'నేను చనిపోయాంతవరకు వైసీపీ లోనే ఉంటాను. ఎలాంటి సమయంలో అయినా జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదు'' అని విజయసాయి స్పష్టం చేశారు. 

''వైసీపీ నాయకులకు ,కార్యకర్తలకు న్యాయస్థానం పై నమ్మకం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మా నాయకునిపై అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగానే పొరాడాం.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పై గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టారు. న్యాయ వ్యవస్థను మేము కించపరచం'' అని అన్నారు. 

Also Read:నిమ్మగడ్డ అనుకూల తీర్పు వస్తే టీడీపీ సంబరాలు చేసుకుంది.. విజయ్ సాయి రెడ్డి...

''ఎన్నికల కమీషనర్ వ్యవహారం పై మేము సుప్రీంకోర్టు కు వెళ్తున్నాం. రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వం పై విషం కక్కకూడదు. ప్రభుత్వం లేకపోయినా చంద్రబాబు తన మనుషులే అధికారులుగా ఉండాలని అనుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలం గా తీర్పు వస్తే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు'' అని అన్నారు. 

''ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ కి వెళ్తున్నారు.కేంద్రహోం మంత్రి అమిత్ షా తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. రాష్ట్ర సమస్యలపై వారితో చర్చించనున్నారు'' అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios