అమరావతి: ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్రాలు సంధించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా విజయ సాయి రెడ్డి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

 

మరో నాలుగు వారాలు  ఓపిక పట్టు ఉమా... ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకు వస్తోందని ఆయన మండిపడ్డారు.అధికారులు, బాధితులైన కాంట్రాక్టర్లు నీ దోపిడి వ్యవహరాల ఫైళ్లను స్వచ్ఛంధంగా తెచ్చిస్తున్నారని ఆయన చెప్పారు.

 

పోలవరం, హంద్రీ-నీవా ప్రాజెక్టు అంచనాల్లో వందల రెట్టు అంచనాలు పెంచిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు మధ్యప్రదేశ్ సీఎం దావోస్ వెళ్లిన సమయంలో విడిది కోసం రూ. 1.8 కోట్లను ఖర్చు పెట్టారని పచ్చ మీడియా గగ్గోలు పెట్టిందని ఆయన మీడియాపై కూడ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

 

ఆహ్వానం లేకున్నా వెళ్లిన చంద్రబాబునాయుడు ఆయన కొడుకు రూ. 100 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన విషయాన్ని మీడియా ఎందుకు ప్రశ్నించదని ఆయన ప్రస్తావించారు.