ఆలస్యమైనా విశాఖే ఎగ్జిక్యూటివ్ రాజధాని: విజయసాయి రెడ్డి
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కచ్చితంగా అవుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ ప్రక్రియ జరగడం కొంత ఆలస్యమైతే కావొచ్చన్నారు.
విశాఖపట్టణం: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కచ్చితంగా అవుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ ప్రక్రియ జరగడం కొంత ఆలస్యమైతే కావొచ్చన్నారు.
శుక్రవారం నాడు విశాఖపట్టణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖకు న్యాయం జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతిస్తే చంద్రబాబు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.ఉత్తరాంధ్రకు న్యాయం చేయడం బాబుకు ఇష్టం లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు దేహంలో అణువణునా నెగిటివిటీ ఉందన్నారు. విశాఖ నుండి చంద్రబాబును, లోకేష్ ను తరిమికొడతామన్నారు. బాధ్యత లేని నాయకులు విశాఖలో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు ఏ విషయాన్నైనా వక్రబుద్దితో ఆలోచిస్తారని ఆయన విమర్శించారు. ఏబీసీడీ పార్టీ టీడీపీనే అని ఆయన చెప్పారు. ఏబీసీడీ అంటే ఆల్ బేవర్స్ చీటర్స్ డెకాయిట్స్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు.
టీడీపీ అంటే తెలుగు డెకాయిట్ పార్టీ అని ఆయన విమర్శించారు.చంద్రబాబు హయంలోనే భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు. విశాఖు మంచి జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చడం లేదన్నారు.
చంద్రబాబు హయంలో విశాఖలో భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తాము విశాఖను కబ్జాలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.
విశాఖ నుండి భూరాబందుల్ని తరిమికొట్టాలని ఆయన ప్రజలను కోరారు.
మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల తర్వాత టీడీపీ చాఫ్టర్ ముగిసినట్టేనని ఆయన చెప్పారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ 85 శాతం విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.