చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం: విజయసాయిరెడ్డి సంచలనం

Ysrcp MP Vijayasai Reddy sensational comments on Chandrababunaidu
Highlights

చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే బాబు అక్రమాస్తులపై విచారణ జరిపిస్తామన్నారు. 

హైదరాబాద్: వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై విచారణ జరిపిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.  చంద్రబాబునాయుడు జైలు కెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

మంగళవారం నాడు  ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లా కమిషన్ ఛైర్మెన్ కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  వైసీపీ అధికారంలోకి వస్తే బాబు అక్రమాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.  అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వని  బీజేపీకి  రాజ్యసభ డిప్యూటీ  ఛైర్మెన్  ఎన్నికల్లో   బీజేపీ కానీ, ఆ పార్టీ మిత్రపక్షాల అభ్యర్ధికి కానీ వైసీపీ మద్దతును ఇవ్వదని ఆయన ప్రకటించారు. ఒకవేళ ఓటింగ్ జరిగితే  ఎన్నికల్లో పాల్గొంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర పతి ఎన్నికల సమయంలో  ప్రత్యేక హోదాను ఇస్తోందనే బీజేపీపై ఆశలు ఉండేవని ఆయన చెప్పారు. 

అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడు ఏపీ ప్రయోజనాలను తన స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఆయన  ఆరోపించారు. రాజ్యాంగానికి చంద్రబాబునాయుడు  హానికరమైన వ్యక్తిగా బాబుపై విజయసాయిరెడ్డి  విమర్శలు గుప్పించారు. 

loader