Asianet News TeluguAsianet News Telugu

అధికారంలో వుంటే రక్తం తాగుతాడు.. విపక్షంలో వుంటే డ్రామాలాడతాడు , బాబు నిజస్వరూపం ఇది: విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

ysrcp mp vijayasai reddy satires on tdp chief chandrababu naidu
Author
Amaravati, First Published Jul 24, 2022, 3:17 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ మా పెద్దన్న చంద్రబాబు అసలు రంగు, రూపం ఇది! అధికారంలో ఉంటే రక్తం తాగే రాక్షసుడు... ప్రతిపక్షంలో ఉంటే సానుభూతి కోసం డ్రామాలు..గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు - బోయపాటి షూటింగులో 30 మంది చనిపోతే ఆయన స్పందన మీరే వినండి. ఆల్జీమర్స్ తో నువ్వు మర్చిపోయినా కర్మ వదలదు బాబన్నా ’’ అంటూ దుయ్యబట్టారు. 

‘‘ బాబన్నయ్యా! సంపాదించిన దాంట్లో కుటుంబ సభ్యులకు వాటా ఇవ్వలేదు. రాష్ట్రానికి న్యాయం చేయలేదు. సీఎంగా 2016-18లో సరాసరి 7.6%, 2018-19లో 8.3% వడ్డీతో అప్పులు తెచ్చావు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2020-21లో కేవలం 6.5% వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది. ఏంటన్నయ్య ఇదంతా ’’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

ఇకపోతే.. కొన్నిరోజుల క్రితం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు (venkaiah naidu) మరోసారి అవకాశం ఇవ్వకుండా వైసీపీ (ysrcp) అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందించారు. వెంకయ్యకు మరోసారి పొడిగింపు ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం బీజేపీదని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (telugu desam party) కొత్త పల్లవి ఎత్తుకుందంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.  మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ‘‘ వెంకయ్య గారికి పొడిగింపు లేదన్నది బీజేపీ నిర్ణయం. టీవి చర్చల్లో భారత ఖండంబు చీలిపోతుందని, ప్రజాస్వామ్యంకే అపాయం అని దుష్ప్రచారం. పచ్చ కుల మీడియా ఉడత ఊపులు విడ్డూరం, అసంబద్ధం. గౌరవ వెంకయ్య గారిని జగన్ గారే అడ్డుకున్నారన్న టీడీపీ కొత్త పల్లవి వాస్తవం కాదు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ ఎంపిక చేసింది. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ మేరకు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధులుగా.. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, గవర్నర్లు ఆనందీబెన్ పటేల్, తమిళిసై సౌందరరాజన్, థావర్‌చంద్ గెహ్లాత్‌ల పేర్లు వినిపించాయి. అయితే వీరెవ్వరూ కాకుండా జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ఖరారు చేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

ఇకపోతే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. జూలై 5 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios